మిచాంగ్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మిచాంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. ముందస్తుగా తుఫాన్ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం శ్రద్ద తీసుకోలేదని, పట్టిసీమను వాడుకోవడం వల్ల తుఫాన్ ల కంటే ముందుగానే పంట చేతికొచ్చేదని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ, పులిచింతల ను పట్టించుకోలేదని, వైసీపీ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ను నాశనం చేశారని అన్నారు. డ్రెయిన్ ల పూసికతీత తీయకపోవడం తో పొలాల్లో నీరు బయటకు వెళ్ళలేదని సీఎం, మంత్రులు తుఫాను పై స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేసారు. తుఫాన్ నష్టంపై రైతులకు భరోసా ఇవ్వడం లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని కరువు, తుఫాన్ నష్టంపై కేంద్రాన్ని ఒక్క రూపాయి కూడా అడగలేదని అన్నారు. నా రాజకీయ చరిత్రలో చూడనంత నష్టం జరిగిందని బాధితులకు న్యాయం చేసేవరకూ టీడీపీ తరపున పోరాడతానని ఆయన అన్నారు. కరువు, తుఫాన్ నష్టంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు. వచ్చేది రైతు ప్రభుత్వమని, రైతులను ఆదుకుంటామని, అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని అన్నారు.
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు….
59
previous post