పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే టిడిపి లక్ష్యమని, వారికి తాము అన్ని విధాల అండగా నిలబడతామని రాజంపేట తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. పండుగ సమీపిస్తున్న వేళ పారిశుద్ధ కార్మికులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయిన ఆయన తన కార్యాలయంలో 95 మంది పారిశుధ్య కార్మికులకు నాణ్యమైన 25 కిలోల బియ్యం బస్తాలుతో పాటు టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మరచిపోయారని అన్నారు. కార్మికులకు అండగా నిలబడిన ఘనత టిడిపిదేనని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనలో వారికి రూ 6 వేలు వేతనం పెంచడం జరిగిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు గత ఎనిమిది రోజులుగా పండుగ, పబ్బం అనుకోకుండా రోడ్డులెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీస చలనం కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రం సుందరంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రధాన భూనిత పోషించేది పారిశుధ్య కార్మికులేనని, వారి కష్టాలు, న్యాయమైన డిమాండ్లు పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికులకు అండగా నేనుంటా…
93
previous post