సమ్మెలో భాగంగా 29 వ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు సమ్మె శిబిరంలో విన్నుతంగా ఆకులు తీని అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ రేపల్లె ప్రాజెక్ట్ సీనియర్ నాయకులు డీ.జయప్రద మరియు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ… ప్రభుత్వం వేతనాలు పెంచకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేశామని చెబుతుంది, మరో పక్క సమ్మె విరమించాలని ఎస్మా ప్రయోగించి బెదిరింపులు చేస్తుంది. అంగన్వాడీలు పట్ల ప్రభుత్వం కక్షధోరణి లాగా వ్యవహరిస్తుంది అని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల. రామకృష్ణారెడ్డిగారు మాట్లాడుతూ మెము గెలిచిన తర్వాతే వేతనాలు పెంచేది అని మాట్లాడటం అంటే మాకు ఓట్లు వేస్తేనే మీ వేతనాలు పెంచుతామని బెదిరిస్తున్నట్లు ఉందాన్నారు. వేతనాలు పెంచకపోతే ఖాళీ కడుపులతో ఎలా బతకాలంటు, ఆకులు తింటూ నిరసన తెలిపారు.
జీతాలు పెంచకపోతే…. ఆకులు తిని బతకాలా
183
previous post