అక్రమ ఇసుక దందా….

Illegal sand mining

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ఇసుక ర్యాంపుల్లో ఇసుక దందా యదేచ్ఛగా కోనసాగుతోంది&period; గోదారమ్మ గర్భాన్ని చీల్చి యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు కాంట్రాక్టర్లు&period; రాత్రి అయితే చాలు గోదావరి గట్టు వెంబడి డ్రజ్జర్ మోత మోగుతోంది&period; డ్రజ్జర్ లతో ఇసుక కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు&period; గంటకు ఒక డ్రజ్జర్ కి మూడు నుంచి ఐదు లారీల వరకు ఇసుక సేకరణ జరుగుతుంది&period; సాధారణంగా ఇసుకను సేకరించేందుకు సాంప్రదాయ పద్ధతిలో పడవల ద్వారాకార్మికుల ద్వారా ఇసుక సేకరణ చేయాల్సి ఉంది&period; ఈ ప్రాసెస్ లో సొమ్ములు దక్కకపోవడంతో ఇసుకాసురులు యంత్రాలను వాడుతున్నారు&period; గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం గోదావరి నదిలోఎటువంటి యంత్రాలను వాడకూడదని ఆదేశాలున్నాయి&period; ఇటీవల హైకోర్టు సైతం ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం&period; అయినా లెక్క చేయకుండా ఇసుక కాంట్రాక్టర్లు యదేచ్ఛగా ఇసుకను డజ్జర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు&period; హోం మంత్రి తానేటి వనిత ఇలాకా కావడంతో అధికారులు కన్నెత్తి చూడడానికి జంకుతున్నారు&period; అయితే ప్రజా ప్రతినిధులు అండదండలతోనే యదేచ్చగా దందా&comma;రవాణా జరుగుతున్నట్లు బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి&period; ప్రజా ప్రతినిధులకు రోజుకు ఇంత అనే విధంగా సొమ్ము కాంట్రాక్టర్లు ముట్ట చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది&period; అధికారులు వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు సిద్ధమంటూ పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..