తెలంగాణ:
ఆరు గ్యారంటీల అమలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టింది. ఇక మరో రెండు హామిలు అమలుకు సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్తు కింద 200 యూనిట్లు గృహావసరాలకు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రాఫ్ర్ట మంత్రిమండలి నిర్ణయించింది. అయితే ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రిమండలి తీర్మనించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను విలేకరులకు వెల్లడించారు. Read Also..