80
100 మీటర్ల రోడ్డు వేయడం చేతకాని సీఎం పోలవరం ను కడతారా అని ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు అన్నారు. కాకుమాను మండలంలో పెదనందిపాడు నుండి బాపట్ల వెళ్లే రహదారిలో గల 100 మీటర్ల పొడవు కూడా లేని రోడ్డును బాగు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఇక్కడ రోడ్డును వెంటనే పున్నమించకపోతే జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, ప్రభుత్వానికి మూడు రోజులు గడువు ఇస్తున్నట్టు ఈ లోపు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహన చోదకులు అనునిత్యం ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలు అవటం జరుగుతుందని వెంటనే ఈ రహదారిని పునర్నిర్మించాలని లేనిచో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.