CITU యూనియన్ నాయకులు చేసిన ట్రాన్సఫర్ ఆర్డర్ ఫై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఏఐటీయూసీ యూనియన్ పైన చేసిన ఆరోపణలను మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే5 గనిలో ఓవర్ మేన్ ట్రాన్స్ఫర్ విషయంలో AITUC యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ ట్రాన్స్ఫర్లు గత సంవత్సరం తేదీ 30.9.2023 11 మంది మైనింగ్ స్టాప్ సిబ్బందిని కాసిపేట మైన్ కు బదిలీ చేయడం జరిగినది. కొంతమంది ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అయినారు కానీ ఈ ఓవర్ మెన్ ను CITU యూనియన్ వాళ్లు మేము ఆపుతామని అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ ఓవర్ మెన్ కు అన్యాయం చేశారు. CITU, ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఈ ఓవర్ మెన్ ను రిలీవ్ చేయలేదు. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పాత ఆర్డర్ ప్రకారం అందరినీ చేసినట్టుగా ఇతన్ని కూడా రిలీవ్ చేసినారు. సిఐటియు అసమర్థత నాయకులు తప్పుడు వాగ్దానం ఇచ్చి మోసం చేసి అతని మనన్నాలను పొందనికి గుర్తింపు సంఘం చేసిందని షో ఫుట్ ఆఫ్ ధర్నాలతో కార్మికులను మభ్యపెడుతున్నారు. ఇదే చిత్తశుద్ధి కార్మిక సమస్యలపై చేస్తే కార్మికులు హర్షిస్తారు. కానీ ఇలాంటి సంఘాలు ఓడిపోయామని అక్కసుతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘాన్నిబదనాం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఎన్నికల ముందు యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలు ఆపాలని చూసినవాళ్లు ఏఐటియుసిని విమర్శించడం తాగదన్నారు ఆరోపణలు మానుకోండి అని హెచ్చరించారు.
అసమర్థ నాయకులు…
97
previous post