ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.

Advertisements

<p>ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు విలయం సృష్టిస్తున్నాయి&period; పెద్దసంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి&period; ఈశాన్య ప్రాంతమైన నూరిస్థాన్ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి&period; ఈ జలప్రళయంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా&period;&period; 100 మందికి పైగా గల్లంతయ్యారు&period; దుర్గమ పర్వత ప్రాంతంలో సహాయక బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి&period; మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; గల్లంతైన వారిలో ప్రావిన్స్ రాజధాని పరూన్ మేయర్ సహా&period;&period; ఆయన ఇద్దరు సెక్యూరిటీగార్డులు కూడా ఉన్నట్లు సమాచారం&period; ఈ వరదల కారణంగా పరూన్ నగరం అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నట్లు తాలిబన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది&period; ఉగ్రరూపం దాల్చిన వరద&period;&period; ఇళ్లను&comma; వ్యాపార సముదాయాలను ముంచేసింది&period; వరద నీటిలో నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి&period; 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు&period; మరోవైపు గల్లంతైన వారికోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టగా&period;&period; రోడ్లు ధ్వంసం కావడం&comma; క్లిష్టమైన పర్వత ప్రాంతం కావడంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు&period; మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.