పశ్చిమగోదావరి జిల్లా మారని తాడేపల్లిగూడెం పట్టణం గుణ్ణం ఫంక్షన్ హాల్ రోడ్డులో గల జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల తీరు గత నెల 30న ఒక మైనర్ విద్యార్థినిని చితకబాదిన విషయం మరువకముందే తాజాగా అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉంటున్న ప్రసన్నలక్ష్మి అనే టీచర్ పిల్లలపై దాడి చేసింది. స్కూల్ యూనిఫాం, క్రమశిక్షణ నెపంతో విచక్షణారహితంగా విద్యార్థులను చావబాదిన ప్రసన్నలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు. ప్లెడ్జ్ అనంతరం స్కూల్ యూనిఫామ్ వేసుకుని రాలేదంటూ సుమారు 40 నుండి 50 మంది పిల్లలను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రసన్న లక్ష్మి బెత్తంతో దండించింది. మొన్న ఇదే స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న సూరత్ సాయి తేజేస్వి పై (11) ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని అప్పగించలేదనే నెపంతో స్కూల్ టీచర్ వరుణ్ విచక్షణా రహితంగా చితకబాదడు. దీంతో ఆ విద్యార్థిని ఎడమ బొటన వేలు పై తీవ్ర గాయం కాగా, వీపు పైన, మిగిలిన చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయమై అడిగిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులపై స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ గోపీచంద్ దారుణ పదజాలంతో వారిని దూషించించారు. దీంతో వారు అప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్, పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోని విద్యాశాఖాధికారులు. మరలా తాజాగా ప్రసన్న లక్ష్మి అనే అదే స్కూల్ కి చెందిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను బెత్తంతో చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది. అంతే కాక స్కూల్ యూనిఫామ్ తమ వద్దే తీసుకోవాలంటూ ఆంక్షలు పెడుతూన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ చేసారు. యూనిఫామ్ ధర సుమారు 2,500 నుండి 8,000 వరకూ ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం మధ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారని, తరగతి గదులు టాయిలెట్ రూమ్స్ పక్కనే ఉండటంతో భరించలేని దుర్వాసన వస్తుందని చెప్పిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారని క్లాస్ రూమ్ లోకి చూడడానికి వెళ్తే లోనికి వెళ్లనివ్వడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు జాయినింగ్ టైంలో స్కూల్ ఫీజులు తక్కువ చెప్పి రెండు నెలల తర్వాత స్కూల్ యాజమాన్యం ఫీజులకు సంబంధించిన యాప్ పెట్టి ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ అధికారులు హెచ్చరించినా జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ వారి తీరు ఏమి మారలేదు. విద్యార్థులను చావగొడుతున్న టీచర్ ప్రసన్న లక్ష్మి, పాఠశాల చైర్మన్ గోపీచంద్ ల పై తక్షణమే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి స్కూల్ గుర్తింపు రద్దు చెయ్యాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది స్కూలా లేక జైలా….
78
previous post