మమ్మల్ని దిక్కులేని స్థితిలో పడేసింది ఈ ప్రభుత్వమే కదా….

Road blockade and protest

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13 వ రోజుకు చేరుకుంది&comma; స్థానిక గన్నవరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ రహదారిపై బైఠాయించి రహదారి దిగ్బంధం చేసి నిరసన తెలియజేసి అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపు గ్రాడివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి 13 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అడుగుతున్న సమాధానం లేదని అన్నారు&period; బొత్స సత్యనారాయణ మూడు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు&period; హామీలు ఇవ్వడం కాదు మాకు కావలసింది ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మాకు న్యాయం చేయాలి&period; మేము రోడ్డుపై ఇబ్బందిపడి నిరసన చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా దేశం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు&period; ఇది సభమేనా అంగన్వాడిలను రోడ్డున పడేసి పట్టించుకోకుండా దిక్కులేని స్థితిలో మమ్మల్ని చేసింది ఈ జగన్ ప్రభుత్వమే కదా అని వారు ప్రశ్నించారు&period; మేము న్యాయమైన కోరికలే కదా అడిగేది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి అడగట్లేదు కదా ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వారు ఈ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు&period; ప్రభుత్వ పథకాలు ఏమైనా పెట్టుకుందామా అంటే ఆన్లైన్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా చూపించబడుతున్నాము దాని వలన మేము ఏ పథకానికి అప్లై చెయ్యలేకపోతున్నాము&period; మా జీవితాలు మొత్తం ఈ అంగన్వాడి ఉద్యోగానికి అంకితం చేసి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఉద్యోగ భద్రత లేకుండా మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు బాధపడ్డారు&period; వెంటనే ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించే విధంగా కనీస వేతనం 26000 చేసి&comma; ఉద్యోగ భద్రత కల్పించి&comma; వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్