102
గిరిజనులతో, లంబాడీలకు ఉన్న బంధం ఈనాటిది కాదని, లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని.. ఆ బంధమే నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను ఏర్పాటు చేసేలా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. వివిధ మండలాలకు చెందిన గిరిజనులు సంప్రదాయ దుస్తులలో పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.