Jagan Mohan Reddy :
శాంతిపురం మండలంలో ఈ నెల 26 న రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు విధులు నిర్వహించాలి. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖా మంత్రి…. రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతిపురం పర్యటనకు అధికారులు సమిష్టి గా బాధ్యత తో పనిచేయండి. మంగళ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన నిమిత్తం ముందస్తు ఏర్పాట్లు పై శాంతిపురం మండలం ఎస్ ఎల్ వి కళ్యాణ మండపం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు డా పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, చిత్తూరు ఎం పి ఎన్ రెడ్డప్ప, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, ఎస్.పి జాషువా, రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన ల సలహాదారులు తలశీల రఘురాం, ఎమ్మెల్సీ భరత్ లతో కలసి సమీక్ష నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ సందర్భంగా మంత్రి డా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం నియోజక వర్గం శాంతిపురం పర్యటన సoదర్భంగా అధికారులు బాధ్యతతో పనిచేసి విజయవoతం చేయాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనలను తప్పక పాటించాలనన్నారు. కుప్పం కు కృష్ణా జలాలను హంద్రీ నీవా కాలువ ద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పనులు పూర్తి చేస్తున్నామని, ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా రామకుప్పం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువ వద్ద కానీ శాంతి పురం మండలం గుండ్లశెట్టి పల్లి వద్ద కానీ పూజ చేయించి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పరమ సముద్రం వద్ద చెరువుల కు నీరు అందించేందుకు మరియు 55 చెరువులకు నీరు అందించేందుకు గేట్ లు పెట్టి తూములు ఏర్పాటు చేయడం లైనింగ్ చేయడం జరిగందన్నారు. నీరు రావడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈనెల 26న గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి కుప్పం నియోజక వర్గం శాంతి పురం పర్యటనను అధికారులందరూ సమష్టి గా పని చేసి విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశమునకు ముందుగా శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద బహిరంగ సభ, రామ కుప్పం మండలం రాజ్ పేట వద్ద హంద్రీ నీవా కాలువను, హెలిప్యాడ్, పార్కింగ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.