Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaKhammam ఇంట్లో మనిషిలా.. పుంగనూరు ఆవు..

ఇంట్లో మనిషిలా.. పుంగనూరు ఆవు..

by Rama
Punganur Cow

పుంగనూరు ఆవు (Punganur cow):

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం జయలక్ష్మిపురం గ్రామంలో అరుదైన జాతికి చెందిన పుంగనూరు ఆవు ను పెంపుడు జంతువు గా సాకుతున్నారు. గుంట్రు వెంకట స్వామి, తిరుపతమ్మలకు ఒక కుమారుడు. వీరికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. తమకు కూతురు లేకపోయినా.. ఒక ఆవును తెచ్చుకుని పెంచుతున్నారు. అదే ఆవుకు పక్క గ్రామంలోని వెటర్నరీ వైద్యుడు సహాయంతో ఇంజక్షన్ ద్వారా క్రాసింగ్ చేయడంతో పుంగనూరు జాతి ఆవు జన్మించింది. దీంతో ఆ ఇంటి యజమానురాలు తిరుపతమ్మ కు పట్టలేని సంతోషం కలిగింది. తమ ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందని, తమకు ఆడ పిల్ల లేక పోయినా.. తమకు కూతురు లా పుంగనూరు జాతి ఆవు జన్మించడం అదృష్టంగా భావించి ఆవు మెడకు, కాళ్లకు, నడుముకి మువ్వలు, గజ్జలు కట్టి అందంగా అలంకరించి అల్లారు ముద్దుగా సాకుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అయితే అత్యంత అరుదైన పుంగనూరు జాతి ఆవు కావడం, చూడటానికి ఎంతో ముద్దుగా 02 అడుగులు ఎత్తు మాత్రమే ఉండటంతో.. ఒక పెంపుడు కుక్క సైజులో చిన్నగా ఉంటూ.. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తిరుగుతుంది. ఈ అరుదైన పుంగనూరు జాతి ఆవు ను చూసేందుకు చాలా మంది వస్తున్నారు. ఇంటి యజమానులు మాత్రం తమకు బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమ గా సాకుతున్నామని, చాలా మంది చూడటానికి వచ్చి డబ్బులు ఇస్తాము అమ్ముతారా అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఎంత మంది వచ్చి అడిగినా సార్ లక్ష్మి దేవిగా భావించే మా ఆవును అమ్మ లేమని వారు చెప్తున్నారు. ఏది ఏమైనా అరుదైన జాతి గా పుంగనూరు జాతి ఆవు.. ఇప్పుడు ఒక ఇంటిలో ఆడ బిడ్డలా… లక్ష్మి దేవిలా… గజ్జెలు.. మువ్వల తో తిరుగుతూ కుటుంబంలో ఒక బిడ్డ గా పెంపుడు జంతువు గా మారిన పుంగనూరు ఆవును చూసేందుకు జనాలు పదుల సంఖ్యలో తరలి రావడం విశేషమే కదా మరి. Read Also..

  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
    నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
  • వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
    వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది. డెలివరీ కోసం వచ్చే గర్భిణీల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఒక బాలింత విషయంలో వైద్యులు చేసిన నిర్లక్ష్యం ఆమె…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014305
Total views : 79836

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.