సార్వత్రిక ఎన్నికల వేడి పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పాలక ప్రతిపక్ష పార్టీ ప్రచార పర్వంలో వేగం పెంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు కడప జిల్లాకు రానున్నారు. వైసీపీ మరోసారి జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి కడపకు చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయి చేరుకొనున్నారు. వైయస్సార్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గ ప్రజలతో మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్నారు.
ఇది చదవండి: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
Follow us on: Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి