Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home International అమెరికాలో ఘోర ప్రమాదం..!

అమెరికాలో ఘోర ప్రమాదం..!

by Satya
Terrible accident in America

America:

అమెరికాలో బ్రిడ్జి(Bridge) కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాల్టిమోర్‌(Baltimore)లో ఓ కంటెయినర్‌ ఓడ.. నదిలో స్టీల్‌ వంతెనను ఢీ కొట్టగా బ్రిడ్జి పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వంతెనపై ప్రయాణిస్తున్న కార్లు నదిలో పడిపోయాయి. ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పటాప్‌స్కో నదిలో బాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతున్న కంటెయినర్ ఓడ, మార్గమధ్యలో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ వంతెనను ఢీ కొట్టింది. నదిలో పడిన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. కార్లలో గల్లంతైన వారు కచ్చితంగా ఎంతమందో తెలియదని సిబ్బంది తెలిపారు. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వంతెన కూలిపోవడం వల్ల బాల్టిమోర్‌ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించగా, అధికారులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: Virat Kohli T20 : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!


లండన్‌లో కన్నులపండువగా గంగా హారతి.
బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది …
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ …
ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: