96
ప్రభుత్వం అసమర్థత అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గంలో ఆయన ప్రజా పాదయాత్ర ఆరవ రోజు కొలకలూరు గ్రామం నుండి ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించలేని స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడని తండ్రి చనిపోయినప్పుడు కపట నాటకంతో ఓదార్చి ఇప్పుడు కనీసం బయటకు రావడం లేదని ఆరోపించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మద్యం అమ్ముతున్నారని దీనివల్ల యువత వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని అన్నారు.