03.03.2024 రోజున సాయంత్రం 05.30 గంటలకు సృజన్ SI పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద వెహిక్లీ చెకింగ్ చేస్తుండగా ఒక బజాజ్ మాగ్చిమ ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వస్తు వారు పెంబర్తి ‘వై’ జంక్షన్ వద్ద మమ్మల్ని చూసి వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా జనగామ పోలీసులు పట్టుకొని వారిని విచారించగా వారు చేసే పని ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో నేరస్తులు అందరూ అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశముతో వారి వద్ద ఆకాశం నుండి ఉల్కలు తెగిపడినప్పుడు ఒక అద్భుతమైన పెట్టి దొరికినదని దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని అది ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని వాళ్ళ జాతకం మారిపోతుందని మరియు మంచి జరుగుతుందని ఆ పెట్టెను 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్ణయించుకున్న మనీ, అట్టి పెట్టెను వరంగల్ కు చెందిన వ్యక్తి కొంటాడని తెలిసి, వారు ఆ మహిమ గల పెట్టెను ఆటో నెంబర్ TS-30-TA- 5631 Bajaj Maxima గలదానిలో పై నలుగురు వ్యక్తులు హైదరాబాదు నుండి వరంగల్ కు వస్తుండగా పెంబర్తి Y జంక్షన్ వద్ద పోలీసు వారు పట్టుకున్నారు. అనంతరం సృజన్ SI జనగామ గారి పిర్యాదుపై ఇన్స్పెక్టర్ జనగామ L.రఘు కేసు రిజిస్టర్ చేసి నేరస్తులను అరెస్టు చేయనైనది.
89