Jayadev Galla :
17వ లోక్ సభ పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గల్లా గారిని దేశ రాజధాని ఢిల్లీలోని అశోకా రోడ్డు (50) లోగల జయదేవ్ గల్లా అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరుపున జ్ఞాపికను అందజేసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ.
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కామెంట్స్ :
2014-2024 వరకు పదేళ్ల పాటు ఏపీ ప్రజాగళాన్ని తన తన గళంగా దేశ రాజధానిలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు ఏపీ హక్కుల సాధనకై వీరోచిత పోరాటం చేసారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ తెచ్చిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేఖంగా రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కేంద్రం గుర్తించే విధంగా భారత దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని గురించి ప్రశ్నిస్తూ ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి ఒక్కటే అని చిత్రపటంలో పెట్టించిన ఘనత జయదేవ్ గల్లా కె దక్కుతుంది. స్వాతంత్ర సమర వీరుల కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్ అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమంలో రైతుల పక్షాన రాజధాని కోసం విరోచిత పోరాటంలో పోలీసుల లాఠీలను సైతం లెక్కచేయకుండా అసెంబ్లీ ముట్టడిని వ్యూహాత్మకంగా జయప్రదం చేసి ముందుకు కదిలిన తీరు యువతకు స్ఫూర్తి దాయకం. రాజధాని అమరావతిలో గజం భూమి లేకపోయినప్పటికీ తన అమ్మమ్మ పేరు అయిన అమరావతికి రాజధాని రైతుల ఉద్యమానికి పలు దఫాలుగా వివిధ రూపాల్లో సుమారు 40 లక్షల ఆర్థిక సాయాన్ని అందించటమే గాక అమరావతి పైన తన మమకారాన్ని చాటుకున్నారు. గడచిన పది సంవత్సరాలలో ఎంపి నిధుల ద్వారా పార్లమెంట్ పరిధిలో ఎన్నో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మరియు పల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో గుంటూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ వెయిటింగ్ హాల్ కొరకు సొంత నిధులు కోటి రూపాయలు ఎంపి నిధుల నుండి కోటి రూపాయలు కాన్సర్ హాస్పిటల్ కు 25 లక్షలు ఇచ్చి దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కోవిద్ -19 సమయంలో రాజన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు 5 కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపి నిధుల నుండి ఒక కోటి రూపాయలు నగదుతో పాటు భారీగా N-95 మాస్కులు ,శానిటైజర్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసి సామజిక బాధ్యతను చాటుకున్నారు. గుంటూరు జిల్లా ప్రజలకు నగరంలోనే పాస్ పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేవిధంగా తోడ్పడటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజలు విద్యార్థులు ఎటువంటి ఆపదలో చిక్కుకున్న ఎక్స్టర్నల్ ఆఫిసర్స్ మంత్రిత్వ శాఖ ద్వారా వెనువెంటనే స్పందించి సమస్యల పరిస్కరానికి తోడ్పడ్డారు. రాజకీయ వేధింపులతో వ్యాపారాలను దెబ్బతీసే విధంగా బెదిరింపు రాజకీయాలతో అధికార పక్షము ఇబ్బందులకు గురిచేసినపప్పటికీ పార్టీ మారాలని వదిలేస్తామని రాయబారాలు పంపినప్పటికీ తలవంచకుండా రాజకీయ నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నారే తప్ప నమ్మిన నాయకుడిని మోసం చేయకుండా ముండవసారి గెలిచే ఆకాశం ఉన్నప్పటికి హుందాగా తప్పుకొని గుంటూరు జిల్లా ప్రజానీకం మరియు రాష్ట్ర ప్రజల గుండెల్లో జయదేవ గల్లా చిరస్థాయిగా చెరగని ముద్రవేశారు.