కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో “జయహో బీసీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెనమలూరు నియోజవర్గంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొదటినుంచి టిడిపి పార్టీకి బీసీలు అండగా వున్నారు. మొదటినుంచి బీసీలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. పార్టీలో నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకి పదవులు ఇస్తామని అన్నారు. ఇతర పార్టీల వారు ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెడనలో చేల్లని రూపాయిని పెనమలూరు నియోజకవర్గంలో చెల్లిద్దామని చూస్తున్నాడని విమర్శించారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉండి టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని బోడె ప్రసాద్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా “జయహో బీసీ” కార్యక్రమం..
105
previous post