రేవంత్‌ పాలన కంటే కేసీఆర్ పాలనయే బాగుంది-జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Advertisements

<p>రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుండేదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తాను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు&period; నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకొందని ప్రశంసించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు&period; ఉద్యోగులు&comma; నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు&period; ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు&period; రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారన్నారు&period; జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని&period;&period; రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు&period; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;<p>జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; ఏప్రిల్ 13à°¨ జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం&period; కేటీఆర్ ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించారు&period; జీవన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా&comma; మంత్రిగా పని చేశారు&period; ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.