కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు కాకాని తరుణ్ (Kakani tarun) రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. జాతీయ పునః నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోది చేసే కృషికి ఆకర్షితులై బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బెంజ్ సర్కిల్ లోని కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి బిజెపి రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.. ఈ సందర్భంగా కాకాని తరుణ్ మాట్లాడుతూ ” నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీ లో చేరానని, ఆదర్శ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ కాకాని వెంకటరత్నం వారసుడిగా కాకుండా వెంకటరత్నం రాజకీయ ఆశయాలకు వారసుడిగా మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నానని “తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన నూతన వధూవరులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి