సత్తెనపల్లి పట్టణంలోని రాజుల కాలనీలో సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి టిడిపి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మరియు జనసేన సమన్వయకర్త బోర్ర వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. 98 శాతం హామిలను నెరవేర్చామని చెప్పుకుంటున్న మోసగాళ్లు 85% హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజల మీద మోయలేని భారాలు మోపాడు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లులు, చెత్త పన్ను కూడా వేసి నిత్యవసర వస్తువులు మోయలేనంత బరువు వేశాడు. దొంగల ముఠా చేసే పనులు ప్రశ్నించిన వారి మీద పోలీస్ కేసులు పెడుతున్నారు. ఆఖరికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుని కూడా 54 రోజులు జైల్లో పెట్టారు. ఈ సంక్రాంతితో చెడు రోజులపై మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. పట్టణంలో ఒక గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేశారన్నారు.
సంక్రాంతి సంబరాల్లో కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు…
175