కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ…

Kavita was taken into custody by the ED

Advertisements

&NewLine;<p>మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ&period;&period; దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది&period; ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది&period; ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భాను ప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు&period; మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు&period; కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం&period; అలాగే&period;&period; ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది&period; కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు&period; కాగా ఈడీ కార్యాలయంలో కవితను నేడు రెండో రోజు అధికారులు విచారించనున్నారు&period; ఉదయం 11 గంటలకు కవితను విచారించనున్నారు&period; నిన్న కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు&period; విచారణ తర్వాత కవితను కేటీఆర్‌&comma; హరీష్&comma; భర్త అనిల్&comma; లాయర్ మోహిత్ రావు తదితరులు కలిశారు&period; మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ సవాల్‌ చేస్తూ నేడు సుప్రీం కోర్టులో పిటేషన్ దాఖలు చేయనున్నారు&period; అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పిటేషన్‌పై ఈ రోజు విచారణ జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..