81
విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలవడం, తాను వైసీపీలో చేరతానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని నాని అనుచరుడు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. తాము టీడీపీలోనే ఉంటామని లోకేశ్ కు స్పష్టం చేశారు. టీడీపీని వదిలి వచ్చేది లేదని తాము కేశినేని నానితో చెప్పిన విషయాన్ని కూడా బొమ్మసాని.. లోకేశ్ కు వివరించారు. జగన్ ఇంటి గడప తొక్కిన కేశినేని నానితో ఇక కలిసేదే లేదని తేల్చి చెప్పారు. బొమ్మసాని ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు స్థానం టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.