84
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం ముగిసింది. 6100 పోస్టులతో డీఎస్సీ 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం లభించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించారు. ఇక SIPB ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.