Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh ఐదో లిస్ట్‌ విడుదల…

ఐదో లిస్ట్‌ విడుదల…

by Prakash
Release of the fifth list of YCP candidates

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఐదో లిస్ట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతిలో అభ్యర్థులను వైసీపీ అధిష్ఠానం మార్పు చేస్తూ కొత్త లిస్ట్‌ను విడుదల చేసింది. కాకినాడ ఎంపీ స్థానంలో చలమలశెట్టి సునీల్, మచిలీపట్నంలో సింహాద్రి రమేశ్ బాబు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పోటీ చేస్తారని తెలిపారు. ఇక ఈ 4 ఎంపీ స్థానాలే కాకుండా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అరకు, సత్యవేడు, అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి. అరకు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడ్డేటి మాధవిని మార్చుతూ ఆ సీటును రేగం మత్య్స లింగంకు కేటాయించారు. ఇక సత్యవేడులో నూకతోటి రాజేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు పోటీ చేస్తారని బొత్స తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: