వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ ఏర్పడ్డాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి… ఇవాళ ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబాలకోటలో జరిగిన రోడ్ షోలో తంబళ్లపల్లి ఎన్డీఏ కూటమి టిడిపి అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి, టిడిపి స్టార్ క్యాంపెనియన్ పనబాతు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు.. అనంతరం జరిగిన పబ్లిక్ మీటింగ్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిందని, వైయస్ వివేకానంద రెడ్డి మృతి చెంది ఐదేళ్లు గడిచినా ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని, సొంత బాబాయ్ కి న్యాయం చేయలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేయగలరని ఆయన ప్రశ్నించారు… ఈ రోడ్ షోలో బిజెపి సీనియర్ లీడర్ చల్లపల్లి నరసింహారెడ్డి కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…