మదర్సా, మసీదు కూల్చివేతతో హింస.. నలుగురి మృతి

Madrasa and mosque demolition violence

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా&comma; దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు కారణమైంది&period; ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 250 మంది వరకు గాయపడ్డారు&period; హింస మరింతగా విస్తరించకుండా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసి నగరంలో కర్ఫ్యూ విధించారు&period; ఇంటర్నెట్‌ను పూర్తిగా నిషేధించారు&period; స్కూళ్లు మూతపడ్డాయి&period; కోర్టు ఆదేశాలతో గురువారం పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రభుత్వాధికారులుమదర్సా&comma; మసీదు అక్రమంగా నడుస్తున్నట్టు ప్రకటించి కూల్చివేశారు&period; అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు&period; అది చివరికి ఘర్షణకు&comma; ఆపై హింసకు దారితీసింది&period; వికృతమూకలు అధికారులపై రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టించారు&period; అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు&period; ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస వికృతరూపం దాల్చింది&period; 20 ద్విచక్ర వాహనాలు&comma; సెక్యూరిటీ బస్‌కు అల్లరిమూక నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..