మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఎస్సై జగదీశ్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర లోని చంద్రపూర్ కు చెందిన అశ్విని – మహేశ్ దంపతులు అదితి (6) కుమార్తె తో కలిసి శనివారం జిల్లా కేంద్రంలోని ఏసీసీ వద్ద నివాసం ఉంటున్న బంధువు సాయిప్రకాశ్ ఇంట్లో సమ్మక్క పూజకు వచ్చారు. ఆదివారం శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూసేందుకు అందరూ కలిసివెళ్లారు. అపార్ట్మెంట్ వద్ద అదితి ఆడుతుండగా దేవాపూర్ కు చెందిన సుమిత్ర తీసుకెళ్తుండగా కొంత దూరం వెళ్లాక ఏడ్చింది. సుమిత్ర ప్రవర్తనపై స్థానికులకు అనుమానం వచ్చి చితకబాది స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని సుమిత్రను స్టేషన్ కు తరలించారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుమిత్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, గత రెండు నెలల నుంచి శ్రీనివాసగార్డెన్ వద్ద అద్దె ఇంట్లో ఒంటరిగా సుమిత్ర ఉండి కూలి పనిచేస్తున్నట్లు తెలిసింది.
మహారాష్ట్ర మహిళా బాలిక కిడ్నాప్ కలకలం..!
87
previous post