రామచంద్రపురం లో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇంచార్జి పిల్లి సూర్య ప్రకాష్ లను యానాం మాజీ ఎమ్మెల్యే, పుదుచ్చేరి అధికారిక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ బోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ కు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రియల్ గా, నిజాయితీ గా ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎంపిక చేయడం సంతోషమని ఆయన అన్నారు. సర్వేలు ఆధారంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అభ్యర్థిని ఎంపిక చేశారని ఇదే విధానాన్ని 175 నియోజకవర్గాల్లో అనుచరిస్తే పార్టీకి, ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. బోస్ వి, నావి వ్యూహాలు ఒకేలా ఉంటాయని నీతి, నిజాయితీ గల విలువలు తో కూడిన రాజకీయాలు చేయడం వలన బోస్, నేను మంచి మిత్రులమయ్యామని అన్నారు. మేము ఇద్దరం వై ఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నావాళ్ళమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాను పిల్లి సూర్య ప్రకాష్ కు మద్దతు గా ఎన్నికల ప్రచారం చేస్తానని, అగ్నికులక్షత్రియ కులస్తుల మద్దతు కోరుతానని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు అంతా పిల్లి సూర్య ప్రకాష్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పిల్లి సూర్య ప్రకాష్ ను సొంత కొడుకులా భావించి ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన అన్నారు.
జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మల్లాడి…
99
previous post