రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం పాత హడగలి గ్రామంలో తెదేపా పోలిట్ సభ్యులు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ హనుమంతుతో పాటు, 30 కుటుంబాలు సోమవారం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వైకాపా నాయకులకు కాలవ శ్రీనివాసులు తెదేపా కండువాలు కప్పి తమ పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పాత హడగలి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని , తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో వైకాపా పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డి హీరే హాల్ మండల తెదేపా కన్వీనర్ హనుమంత రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు కాదలూరు మోహన్ రెడ్డి, తెదేపా ఎంపీటీసీలు మొండి మల్లికార్జున, మురడి గంగాధర, మండల తెదేపా నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టీడీపీలోకి భారీ చేరికలు…
79
previous post