93
దుబాయ్ పంపిస్తా అంటూ మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ కు చెందిన ఏలేటి రమేష్ గత కొంతకాలంగా గల్ఫ్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన కొందరు యువకులకు దుబాయ్ పంపిస్తా అంటూ ఒక్కొక్కరి వద్ద 60000 రూపాయలు తీసుకొని వీసాలు ఇచ్చాడని అయితే తీరా ఎయిర్పోర్టుకు వెళ్లగా అవి నకిలీ వీసాలు అని చెప్పి రిటర్న్ పంపించారని బాధితులు వాపోయారు. అనంతరం నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ ఇంటి ముందు ఆందోళన బాట పట్టారు. నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసిన ఏజంట్ పై అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.