పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరు అయ్యారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్రా, ఎన్. ఐ. ఐ టి, యాక్సిస్ బ్యాంకు, జీయో, బి. డి.ఏమ్.ఎస్ బ్యాంక్, వంటి 60 ప్రముఖ కంపెనీలో సుమారు 5000 ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లాలో మొట్టమొదటి ఆఫ్లైన్ అతిపెద్ద జాబ్ మేళా ఇదేనని ఈ జాబ్ మేళాకు పశ్చిమగోదావరి జిల్లా తో పాటు బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి ప్రముఖ నగరాల నుండి అనేకమంది నిరుద్యోగులు హాజరయ్యారని ఆయన తెలిపారు. అనేకమంది యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపాధి కల్పించేందుకు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ ముఖ్యఅతిధులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో ఈ మెగా జాబ్ మేళా చూస్తే అర్థమవుతుందని వేలాదిమంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు అభినందనీయుడని అన్నారు. Read Also..
నరసాపురంలో మెగా జాబ్ మేళా..
91
previous post