ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మంథని శివ కిరణ్ గార్డెన్ లో మెగా జాబ్ మేళా రామగుండం సిపి రిబ్బన్ కట్ చేసి , ప్రారంభించి, యువతి యువకుల్లాని ఉద్దేశించి నిరుద్యోగం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మెగా జాబ్ మేలని ఉపయోగించుకొని, ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించే దిశగా ముందు సాగాలని సూచించారు. నేడు దాదాపుగా 65 కంపెనీలతో దాదాపుగా 5 వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమీషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.
Mega Job Mela
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా హాజరు అయ్యారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్రా, ఎన్. ఐ. ఐ టి, యాక్సిస్ బ్యాంకు, జీయో, బి. డి.ఏమ్.ఎస్ బ్యాంక్, వంటి 60 ప్రముఖ కంపెనీలో సుమారు 5000 ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లాలో మొట్టమొదటి ఆఫ్లైన్ అతిపెద్ద జాబ్ మేళా ఇదేనని ఈ జాబ్ మేళాకు పశ్చిమగోదావరి జిల్లా తో పాటు బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి ప్రముఖ నగరాల నుండి అనేకమంది నిరుద్యోగులు హాజరయ్యారని ఆయన తెలిపారు. అనేకమంది యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపాధి కల్పించేందుకు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ ముఖ్యఅతిధులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో ఈ మెగా జాబ్ మేళా చూస్తే అర్థమవుతుందని వేలాదిమంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి నాయుడు అభినందనీయుడని అన్నారు. Read Also..
అల్లూరి జిల్లా ఎస్పీ తుసన్ సిన్హా కృషితో ఈనెల ఫిబ్రవరి 6 తారీఖున టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తో మెగా జాబ్ మేళా నిరుద్యోగులైన యువతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి కొరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. నిరుద్యోగులైన యువతులు ఆరో తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు చింతపల్లి వైటిసి నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని అన్నారు. అర్హులైన యువతలకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు 20 వేల రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు. ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో యువతలు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు.




Total views : 78287