మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై మీమ్స్ తయారుచేసి బహిరంగ సభలో ఎమ్మెల్యే అనుచరుడు దుబాయ్ కరీముల్లా ప్రదర్శించాడు. దుబాయ్ కరిముల్లా పై గత రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాస్తారోక కు బయలుదేరారు. రాస్తారోక చేయడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. సౌమ్య ను అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కేసు కట్టే వరకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడే బైఠాయించి ఉంటామంటున్నారు.
సౌమ్య పై మీమ్స్ … బహిరంగ సభలో ప్రదర్శన
105
previous post