విజయవాడ బాపు మ్యూజియంలో లెడ్జెర్ షో, సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్కే.రోజా పాల్గొన్న షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యువజన సర్వీసుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ అబ్బుర ఇతర పురావస్తు ప్రదర్శనశాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ ఈ మ్యూజియం ప్రాంగణంలో లైట్ అండ్ సౌండ్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్ ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. బాపు మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందిన కట్టడం. నేటి తరానికి చరిత్రను తెలియజేసేందుకు టెక్నాలజీని జోడించాం, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చిన్నారులకు తెలియజేసేందుకు లైట్ అండ్ సౌండ్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. నేను మంత్రి అయిన తర్వాత భవానీ ఐ ల్యాండ్ ను అభివృద్ధి చేశానని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
బాపు మ్యూజియంలో లెడ్జెర్ షో ప్రారంభించిన మంత్రి రోజా
78
previous post