ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించిన సర్కార్..

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించిన సర్కార్

Advertisements

<p>తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులు&comma; ఉపాధ్యాయులు&comma; పెన్షనర్లకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం శుభవార్త అందించింది&period; వారి కరవు భత్యాన్ని &lpar;డీఏ&rpar; 2 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది&period; ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది&period; కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన నేపథ్యంలో&comma; అదే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది&period; ఈ పెంపు 2026 జనవరి 1 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ&period;1&comma;230 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు అంచనా వేశారు&period; అయినప్పటికీ&comma; ఉద్యోగులు&comma; ఉపాధ్యాయులు&comma; పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది&period; ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది&period;<br &sol;>&NewLine;ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు&comma; పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి&period; పెరుగుతున్న ద్రవ్యోల్బణం&comma; జీవన వ్యయాల నుంచి ఇది కొంత ఉపశమనం కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు&period; పెంచిన డీఏ&comma; బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేయనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..