11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత

Advertisements

<p>భారత సాంస్కృతిక వారసత్వ సంపద పునరుద్ధరణలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది&period; 11à°µ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అత్యంత అరుదైన&comma; పవిత్రమైన రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అధికారికంగా అప్పగించింది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ చారిత్రక ఆధారాలను భారత్‌కు హ్యాండోవర్ చేశారు&period; ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరికొత్త మైలురాయిగా నిలిచింది&period; ఐదు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ పర్యటన ముగించుకుని శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్న పీఎం మోదీ సమక్షంలో ఈ బదిలీ ప్రక్రియ జరిగింది&period; ఈ పర్యటనలో స్వీడన్&comma; నార్వే&comma; ఇటలీ దేశాలు కూడా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>ప్రసిద్ధ హిందూ చక్రవర్తి రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ రాగి శాసనాలు సుమారు 30 కిలోల బరువు కలిగి ఉన్నాయి&period; చోళ రాజవంశపు రాజముద్ర కలిగిన ఒక కాంస్య రింగ్‌తో ఇవన్నీ ఒకదానికొకటి బంధించబడి ఉన్నాయి&period; ఈ శాసనాలు రెండు విభాగాలుగా విభజించబడ్డాయి&period; ఇందులో ఒక భాగం సంస్కృత భాషలో&comma; మరొక భాగం తమిళ భాషలో చెక్కబడి ఉంది&period;మహారాజ రాజరాజ చోళుడు ఒక బౌద్ధ విహారానికి భూగ్రామ రూపంలో ఇచ్చిన ఆదాయ విరాళాల వివరాలు ఈ శాసనాల్లో ఉన్నాయి&period; రాజా రాజరాజ చోళుడు మొదట దీనిని తాటి ఆకులపై రికార్డు చేయగా&comma; ఆ తర్వాత అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు ఈ దానాన్ని శాశ్వతంగా భద్రపరచడం కోసం మన్నికైన రాగి రేకులపై చెక్కించారు&period; ఈ పలకలను బంధించే కాంస్య ఉంగరంపై రాజేంద్ర చోళుడి ముద్ర ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..