ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి….

Protest against the government by kneeling

Advertisements

&NewLine;<p>ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణాజిల్లాలో మూడవ రోజుకి చేరింది&period; సమ్మెలో భాగంగా విధులకు గైర్హాజరైన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్ లో మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు&period; ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ &amp&semi; హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మీడియాతో మాట్లాడుతూ… అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు&period; కనీస వేతనం రూ&period; 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; వేల రూపాయలు అదనంగా పెరిగిన ధరలకు అనుకూలంగా ఈ రోజు మేము వేతనాన్ని పెంచమని అడుగుతున్నాము&period; పదివేలు వేతనంతో ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇబ్బందులు పడుతుంది&period; కాబట్టి వేతనం పెంచాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అలాగే సెల్ ఫోన్లు ఇచ్చారు సపోర్ట్ చేయని సిమ్ములు ఇచ్చారు&period; మరి డ్యూటీల కెళ్ళి అప్లోడ్ చేసిన ఫోటోలు మాకు కావాలి అని చెప్తున్నారు&period; మేం పనికి వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు మాకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా&comma; ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది&period;&period; కాబట్టి ఈరోజు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది&period; అధికారులు వేధింపులతో పాటు ప్రజాప్రతినిధులు వేధింపులు కూడా మాకు ఎక్కువైపోయాయి&period; మా యొక్క డిమాండ్ న్యాయపరమైనది వెంటనే పరిష్కరించాలి&period; అధికారుల వత్తిడి వల్ల ఆశ వర్కర్ చనిపోయిన పరిస్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి అలాగే చనిపోయిన ఆశ వర్కర్కి ఎటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదని&comma; కనీసం మట్టి ఖర్చులు కూడా అందరు చందాలు వేసుకుని మరి కార్యక్రమాలు చేయవలసిన దుస్థితికి దిగజారిపోయింది&period; సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..