ఏడాది కి 5 లక్షల చొప్పున మొత్తం 25లక్షల ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తానని హామీ నిచ్చి సీఎం జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడని మాజీ మంత్రి విజయవాడ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఉచితంగా ఇవ్వకపోగా గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారని, గృహాలు నిర్మించుకోక పోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరించి పేదల చేత అప్పు చేయించి ఇళ్లు కట్టించి వారికి బిల్లులు చెల్లించక అప్పుల పాలు చేశారని, ఇళ్ల పేరుతో డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి పేరుతో రూ.35 వేలు చొప్పున మొత్తం రూ.3,866 కోట్లు అప్పులు తెచ్చి మహిళల నెత్తిన వేల కోట్లు అప్పులు నెత్తిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు అప్పు రెండేళ్లు రుణకాల పరిమితి చెల్లించక పోవడంతో బ్యాంకులు నేరుగా లబ్దిదారులకే నోటీసులు ఇస్తున్నాయని, తెచ్చిన అప్పులు ఏమయ్యాయో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదని, ఓటిఎస్ పేరుతో ఎన్టీఆర్, చంద్రబాబు ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు బలవంతం గా రూ.10వేల నుండి రూ.30వేలు జగన్ రెడ్డి వసూలు చేశారని చెప్పారు. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని చోట్ల సెంటు పట్టా ఇచ్చారు. చంద్రబాబు 2 సెంట్లు ఇస్తే దాన్ని 1 సెంటుకు కుదించారని, రూ.7 వేల కోట్లకు పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు సెంటు పట్టాలో కుంభ కోణం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భారతి సిమెంటులో బూడిద కలిపి కట్టిన ఇళ్లు కూలిపోతున్నవి. చంద్రబాబు 5 ఏళ్లల్లో 12 లక్షలు నాణ్యమైన ఇళ్లు కట్టగా జగన్ హయాం లో 10 శాతం కూడా ఇళ్లు పూర్తి చేయలేదు. కేంద్రం ఇచ్చిన రూ.1.80 లక్షల తోనే సరిపెట్టాడు. దానికి రాష్ట్ర నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు గ్రామాల్లో ఇళ్లకు రాష్ట్ర నిధుల నుండి రూ.50వేలు, పట్టణాల్లో లక్ష రూపాయలు అధనంగా ఇచ్చారు. రూ.320 ఉన్న భారతి సిమెంట్ జగన్ పాలనలో రూ.420కి పెంచారు. ఐరన్ చంద్రబాబు పాలన లో రూ.45వేలు ఉండగా, జగన్ పాలనలో రూ.68 వేలకు పెంచారు.
ఇసుక ట్రాక్టర్ రూ. 5 వేల నుండి రూ.15 వేలకు పెంచారు. ఈ రోజు చిన్న ఇల్లు కట్టాలన్నా రూ. 5 లక్షలకు తక్కువ కాదు. కేవలం కేంద్రం ఇచ్చిన 1.80 లక్షలు మాత్రమే జగన్ ఇచ్చి, రాష్ట్ర నిధుల నుండి ఏమీ ఇవ్వనందున పేదలు అప్పులు పాలయ్యారని , పైగా వారు కట్టిన కొద్దిపాటి ఇళ్లు కూడా అవినీతికి పాల్పడి నాసిరకంగా నిర్మించడం వల్ల అవి కూలి పోతున్నాయి. కాలనీలు గ్రామాల్లో, పట్టణాల్లో కలిసి పోతున్నవి. కానీ, జగన్ రెడ్డి ఊరికి, టౌన్ కు దూరంగా సెంటు పట్టాలు ఇచ్చి తిరిగి మురికి వాడు చేస్తున్నారు. ఇరుకు రోడ్లు, వేసి పేదల్ని మోసం చేశారు.జగన్ రెడ్డి మాత్రం 5 ప్యాలెస్ లు నిర్మించుకున్నారు. ఆయన బాత్ రూం ఉన్నంత కూడా పేదలకు ఇవ్వలేదు. టీడీపీ ఆవిర్భావం ముందు నాటి ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి 4 తడికలు, 6 వెదురు బొంగులు, 20 తాటాకు కట్టలు ఇచ్చి గుడిసలు వేయించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పక్కాఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి