కొత్త మెట్రో రైలు రూట్‌ మ్యాప్‌

New Metro Rail Route Map

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గం రెండోదశ విస్తరణ రూట్‌ మ్యాప్‌ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి&period; నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ&comma; భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా&comma; శంషాబాద్‌ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు&period; గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్‌మ్యాప్‌ను రద్దు చేయాలని&comma; కొత్త మార్గాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు&period; ఈ మేరకు విమానాశ్రయం సహా వివిధ కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు&period; తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేలా కొత్త రూట్‌మ్యాప్‌ను డిజైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు&period; పేద&comma; మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న మెట్రో రైలు సేవలు మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ రూట్‌మ్యాప్‌తో నెరవేరనుందని అంచనా వేస్తున్నారు&period; అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌ను కలుపుతూ కొత్త మార్గాలను మ్యాప్‌లో అధికారులు ప్రతిపాదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్