ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు..

nimmagadda ramesh kumar

Advertisements

&NewLine;<p>ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు&period; ఈ మేరకు ఆయన సంస్థ ఇతర ప్రతినిధులతో కలిసి ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు&period; ప్రభుత్వం పార్టీ&comma; రెండూ సమాంతర వ్యవస్థలు&comma; ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదు&period; ప్రభుత్వ వనరులతో&comma; ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం&period; ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం&period; ఇటీవల జారీ చేసిన జీవో నెం&period;7 ద్వారా పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు&period; పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు&period; రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు&comma; పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు&period; ఎన్నికలు&comma; సమీపిస్తున్న తరుణంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది&period; అందుకే ఆయన్ను కలిసి రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం&period; పారదర్శకమైన పాలన జరగాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తోంది’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు&period; ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం కూడా అనైతికమని ఆయన స్పష్టం చేశారు&period; ఓట్లు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు&period; పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలని&comma; నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదని అభిప్రాయపడ్డారు&period; కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..