142
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకును కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ప్రాతినిధ్యం వహిస్తున్న వి. వెంకటాయపాలెం సొసైటీని కూల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపారు. పీఏసీఎస్ లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. ఈ మేరకు ఖమ్మం డీసీవో విజయకుమారిని కలిసిన 11 మంది సభ్యులు వి.వి.పాలెం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమావేశం నిర్వహించి ఓటింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని విజయకుమారి తెలిపారు.