కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం…

No-confidence motion by Congress councillors

Advertisements

&NewLine;<p>మంచిర్యాల మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్&ZeroWidthSpace;లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది&period; కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల సంఖ్యా బలం ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది&period; దీంతో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య&comma; వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ తమ పదవులకు రాజీనామాలు సమర్పిండంతో అవిశ్వాస తీర్మానం లాంఛనమే కానుంది&period; చైర్మన్&comma; వైస్ చైర్మన్ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందకపోవడంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు&period; మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ అవి ఇంకా ఆమోదం పొందలేదు&period; దీంతో ప్రత్యేక సమావేశాన్ని యథావిధిగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు&period; కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్యాంపు ఏర్పాటు చేశారు&period; కౌన్సిలర్లు రెండు రోజుల కింద హైదరాబాద్&ZeroWidthSpace;లోని క్యాంపుకు తరలివెళ్లారు&period; అవిశ్వాస తీర్మానం కోసం నేరుగా మున్సిపల్ సమావేశానికి హాజరై అవిశ్వాసానికి మద్దతు తెతియజేస్తున్నారు&period; కొత్త చైర్మన్&comma; వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు&period; ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో చైర్మన్&ZeroWidthSpace;గా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య&comma; వైస్ చైర్మన్&ZeroWidthSpace;గా చల్లా నరేశ్&ZeroWidthSpace;ను ఎన్నుకునే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..