ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు ఆర్పించారు. బాలకృష్ణ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని బాలకృష్ణ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఆయన అంటే నవరసాలకు అలంకారం అని అన్నారు. నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని బాలకృష్ణ తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు అని ప్రశంసించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వైద్యులు, న్యాయవాదులు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. ఆయన తీసుకొచ్చిన పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…