శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy)ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత సత్యమ్మ దేవాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టిడిపి అభ్యర్థి పల్లె సింధూర ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యమ్మ కూడలి నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులతో కలిసి ఎనుములపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుట్టపర్తి పసుపు మయంగా మారింది. డప్పు వాయిద్యాల నడుమ జరిగిన ర్యాలీ గంటపాటు కొనసాగింది. అనంతరం పల్లె సింధూర ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆర్డిఓ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి