జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జన హితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారని పవన్ హెచ్చరించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం…
89
previous post