ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు…

Protest event in support of traders

Advertisements

&NewLine;<p>కడప జిల్లాలో వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో వ్యాపారులను&comma; సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఎలాంటి రసీదులు&comma; ఆధారాలు లేవంటూ పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడం పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు&period; వ్యాపారులకు మద్దతుగా పట్టణంలోని బంగారు అంగళ్ల సర్కిల్ లో వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా&comma; కోడ్ అమలులోకి రాక ముందే సామాన్యులు తమ అవసరాల కోసం బంగారు&comma; బట్టలు కొనుగోలు కోసం తెచ్చుకున్న సొమ్మును రసీదులు&comma; తగిన ఆధారాలు లేవని సీజ్ చేయడం సరైంది కాదన్నారు&period; తాను చేస్తున్న అభ్యంతరాలను వ్యాపారులకు సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టానికి నిరసన అని భావిస్తారో&comma; రక్షణ అని భావిస్తారోగానీ ఇది ప్రభుత్వానికి&comma; అధికారులకు వ్యతిరేకం కాదని&comma; ప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలియజెప్పే ప్రయత్నమే అన్నారు&period; ప్రజల ఇబ్బందులను సిఎం దృష్టికి&comma; పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు&period; ప్రజలు ఇబ్బందులు పడి వ్యాపారాలు జరగక పోతే&comma; అన్ని వ్యాపార సంఘాల వారు బంద్ చేసే పరిస్థితి వస్తుందన్నారు&period; అదే జరిగితే ప్రొద్దుటూరు వ్యాపారుల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలుగుతుందని చెప్పారు&period; అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోసం ఎవరైనా డబ్బులు తీసుకెళ్లే రాజకీయ నేతలను పట్టుకుంటే అర్ధముందని&comma; ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు&period; స్థానిక పోలీసులు కూడా ప్రజలకు&comma; వ్యాపారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్