రాష్ట్రంలో బీసీల రాజ్యం…. జగనన్నకే సాధ్యం

Sri Chelluboina Srinivasa Venugopalakrishna

Advertisements

&NewLine;<p>సమాజంలో ఉన్నటువంటి ప్రజలు&comma; పౌరుల అవసరాలన్ని తీర్చి దిద్దగలిగే శక్తివంతులు బీసీలు అని రాష్ట్ర బీసీ సంక్షేమం&comma; సమాచార పౌరసంబంధాలు&comma; సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు&period; గురువారం రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం లో మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఇంచార్జ్&comma; మంత్రి&comma; రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి ప్రజా జీవనంలో అన్ని అవసరాల్లోను బలహీన వర్గాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు&period; బీసీలు సమాజంలో వెనుకబడిన వారు కాదని వెన్నెముక లాంటి వారిని గుర్తించిన ఏకైక నాయకుడు&comma; వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పేదవాడు&comma; సంపన్నుడు అనే బేధం లేకుండా దేశ సంపద అందరికీ సమానంగా చేరిన నాడే వారి జీవితానికి భద్రత&comma; భరోసా ఉంటుందన్న లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు&period; దేశంలో అత్యంత ప్రతిష్టాత్మమైన 125 అడుగుల డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రేపు సాయంత్రం 6 గంటలకు విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించు కుంటున్నామని మంత్రి తెలిపారు&period; బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారన్నారు&period; సంక్షోభాలను కూడా అధిగమిస్తూ భరోసా తో కూడి జీవనం సాగిస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పంచభూతాత్మకమైన భూమిలో నీటి మీద ఆధారపడి నీటి నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు మత్స్యకార సోదరులని అన్నారు&period; ధవళేశ్వరం లో మత్స్యకార సోదరులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించిందని అన్నారు&period; వారు ఆర్థికంగా బలపడేందుకు మరిన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు&period; భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయానికి రూపశిల్పమైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అయిన రేపటి నుంచే రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు&period; భారత సంతతి ఆచరించ తగిన గ్రంథం రాజ్యాంగం అటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు&period;తొలుత మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మత్స్యకారులు&comma; స్థానిక నాయకులతో కలసి ధవలేశ్వరం బస్టాండ్ నుంచి జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు&comma; మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్