68
హైదరాబాద్ సమీపంలో గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాషీస్ ఆయిల్ అమ్ముతున్న బాలరాజు, సతీష్, నగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాగార్జున అనే నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 2 లీటర్ల హషీష్ ఆయిల్ తో పాటు 12 వందల రూపాయల నగదు, 3 మొబైల్స్, ఒక పల్సర్ బైక్, సిరంజీల ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మెటీరియన్ విలువ దాదాపు 12 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also..
Read Also..